నిబంధనలను పాటించని రెండు ప్రైవేటు బస్సులు సీజ్

జగిత్యాల   ఫిబ్రవరి 7 (way2newstv.com)
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్న రెండు ప్రైవేటు బస్సులను జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణాశాఖ అధికారి కిషన్ రావు గురువారం ఉదయం  సీజ్ చేశారు. జాతీయ రోడ్డు భద్రత దినోత్సవాల సందర్భంగా రవాణాశాఖ అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బొంబాయి నుండి జగిత్యాల కి నడుస్తున్న డిఎస్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు, ఆరెంజ్ ట్రావెల్స్ చెందిన బస్సును తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేకపోవడంతో ఆ బస్సులను సీజ్ చేశారు. 


నిబంధనలను పాటించని రెండు ప్రైవేటు బస్సులు సీజ్

సీజ్ చేసిన బస్సుల్లో ఒకదానికి టాక్స్ చెల్లించి లేకపోవడం, మరొక బస్సులో లగేజీ తరలించడంతో సీజ్ చేశారు.  ఈ సందర్భంగా రవాణాధికారి కిషన్ రావు మాట్లాడుతూ వాహన యజమానులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను వాహనాలలో ఎక్కించరాదని తెలిపారు. వాహనాలకు సంబంధించి అన్ని రకాల కాగితాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Previous Post Next Post