వెల్ బీయింగ్ సిటీస్ లో అమరావతి

విజయవాడ, పిబ్రవరి 7, (way2newstv.com)
కెనడాలోని మాంట్రియల్‌కి చెందిన ‘న్యూ సిటీస్‌’ సంస్థ నిర్వహిస్తున్న ‘వెల్‌ బీయింగ్‌ సిటీ’ అవార్డుల పోటీలో ఒక విభాగంలో తుది పోటీలో నిలిచిన నాలుగు నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ‘ఆర్థికాభివృద్ధి- అవకాశాలు’ కేటగిరీలో అమరావతికి తొలి ర్యాంకు దక్కింది. తర్వాతి స్థానాల్లో షికాగో (అమెరికా), జుబ్‌జానా (స్లొవేనియా), పుణె(భారత్‌) ఉన్నాయి. 


వెల్ బీయింగ్ సిటీస్ లో అమరావతి

‘న్యూ సిటీస్‌’ సంస్థ మొదటిసారి ఈ పోటీలు నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు చెందిన 100 నగరాలు తలపడుతున్నాయి. విభాగాల్లో 16 నగరాల్ని తుది పోటీకి ఎంపిక చేశారు. ‘ఆర్థికాభివృద్ధి-అవకాశాలు’ కేటగిరీలో అమరాతి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. ఈ విభాగంలో అమరావతి మొదటి ర్యాంకులో నిలిచిందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)  పేర్కొంది. ప్రతి కేటగిరీలో ఒక నగరాన్ని, మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఒక అత్యుత్తమ నగరాన్ని ఏప్రిల్‌లో ఎంపిక చేస్తారు. 2019 జూన్‌ లేదా జులైలో మాంట్రియల్‌లో జరిగే అంతర్జాతీయ వేడుకలో అవార్డులు అందజేస్తారు. 
Previous Post Next Post