రెండు దఫాల్లో కేబినెట్‌ను విస్తరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండు దఫాల్లో కేబినెట్‌ను విస్తరణ

హైద్రాబాద్, ఫిబ్రవరి 9, (way2newstv.com)
ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడిచినా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు, మేధావులు విమర్శలు పెంచుతున్నారు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికైనా కేబినెట్ విస్తరిస్తారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల కంటే ముందే తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


రెండు దఫాల్లో కేబినెట్‌ను విస్తరణ
 
దీనిపై శుక్రవారం ఆయన సమాలోచనలు చేసినట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో బడ్జెట్‌ తయారీ, ఇతరత్రా కసరత్తు జరగాలి. ఇందుకు ఆర్థిక మంత్రి, మరికొందరు మంత్రులుండాలి. అందుకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే రెండు దఫాల్లో కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 8మందితో, రెండో విడతలో మరో 8మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్‌తో చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో కొంతమంది సీనియర్‌ నేతలను మినహాయించి వారికి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువగా కొత్తవారికి పెద్దపీట వేయనున్నారు.