సీమాంధ్ర ఓట్లపైనే రేవంత్ గురి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీమాంధ్ర ఓట్లపైనే రేవంత్ గురి

హైద్రాబాద్, మార్చి 25  (way2newstv.com)
మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారశైలితో… కొత్త అస్త్రాన్ని రూపొందించుకుంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్న సమయంలో.. ఇప్పుడు.. దాన్నే అందుకో బోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొడంగల్ ఓటమి తర్వాత రెండేళ్ల వరకూ సైలెంట్‌గా ఉండాలనుకున్న రేవంత్…క్లిష్ట పరిస్థితిలో.. హైకమాండ్‌ ఆదేశాలను పాటించాలనుకున్నారు. మల్కాజిగిరిలో బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులుగా సీనియర్లను బరిలోకి దింపింది. రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి సీటు కేటాయించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతి పెద్దది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో స్థిరపడి ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికలలోనే టీడీపీ తరపున రేవంత్ … మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. 


సీమాంధ్ర ఓట్లపైనే రేవంత్ గురి

అది ఇప్పుడు సాధ్యమైంది. అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రముఖ నేతల్ని కలిసి మద్దతు కోరడమే కాదు.. కీలమకైన ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార వ్యూహం మాత్రం విభిన్నంగా ఉంటోంది. మల్కాజిగిరి నియోజవర్గంలో.. అన్ని రాష్ట్రాల ప్రజలు … ముఖ్యంగా సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ లాంటి నియోజకవర్గాలన్నీ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశాలు వేరు. ఇప్పుడు… వేరు కాబట్టి… ఓటింగ్ ప్రయారిటీ మారబోతోందని చెబుతున్నారు. కొద్ది రోజులుగా.. ఏపీ రాజకీయాల ప్రభావం హైదరాబాద్‌పై పడుతోంది. సీమాంధ్రకు చెందిన ఆస్తులున్న వారిని బెదిరించి.. వైసీపీకి మద్దతుదారులుగా మారాలన్న హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిచేయాలన్న డిమాండ్‌ను రేవంత్ తెరపైకి తీసుకు వస్తారా.. అన్న చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ గెలిస్తే.. హైదరాబాద్‌లో కొత్త మార్పులు వస్తాయని రేవంత్ చెబుతున్నారు. ఇప్పటికే ఆస్తులున్న ఆంధ్రులను బెదిరిస్తున్నారనే ప్రచారం జరుగుతూండటంతో… వారికి ఆభయం ఇచ్చేలా.. రేవంత్ ప్రచార వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.