మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్. ప్రస్తుతం దాదాపుగా ఆ సంస్థ నుంచి డజను చిత్రాలు పైప్ లైన్‌లో ఉన్నాయి. వాటిలో అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో వ్యవహరిస్తారు ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు. ఆ నమ్మకంతోనే ఆయన తాజాగా ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆరు చిత్రాలను విడుదల చేస్తున్న సురేశ్ ప్రొడక్షన్స్
సమంత నటించే `ఓ బేబీ`, అల్లు శిరీష్ నటించే `ఏబీసీడీ`, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక నటించే `దొరసాని`, `ఫలక్‌నుమాదాస్`, `మల్లేశం`, శ్రీ విష్ణు, నివేదా థామస్ నటించే `బ్రోచేవారెవరురా` వంటి చిత్రాలన్నీ సురేశ్‌బాబు సహకారంతో విడుదల కానున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు చక్కటి రిలీజ్ డేట్, మంచి థియేటర్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. సురేశ్ బాబు బ్యాకప్‌తో ఈ సినిమాలు అన్నిటికీ అలాంటి మంచి థియేటర్లు, మంచి రిలీజ్ డేట్ దొరికాయి.