ఎన్నికల విధులు కేటాయించని జాబితాను రూపోందించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల విధులు కేటాయించని జాబితాను రూపోందించాలి

కర్నూలు, ఏప్రిల్,08 (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల విధులు కేటాయించని వారి జాబితాను వెంటనే ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ యస్.సత్యనారాయణ జిల్లా అధికారులతో అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల నిధులు కేటాయించని జిల్లా అధికారులతో ఆయన సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  మీ శాఖల పరిధిలో ఎన్నికల విధులు కేటాయించని వారి జాబితాను వేంటనే ఇవ్వాలన్నారు. 


ఎన్నికల విధులు కేటాయించని  జాబితాను రూపోందించాలి

దేవాదాయ ధర్మదాయ శాఖలో 135 మంది, విద్యాశాఖలో 15 మంది, వ్యవసాయ శాఖలో 10 మంది దాక ఉన్నారని ఆయా శాఖల అధికారులు కలెక్టర్ దృష్టి తెచ్చారు. మిగిలిన అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది జాబితాను ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుభూషన్, వ్యవసాయ శాఖ జెడి ఠాగూర్ నాయక్, మత్యృశాఖ జెడి లాల్ మహహ్మద్, డిఇఓ తెహరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.