రోడ్డు షోలో ఘనస్వాగతం
మంత్రాలయం, ఏప్రిల్ 08 (way2newstv.com)
మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి కి కోసిగి మండలంలో సర్పంచ్ ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వేలాదిమంది కార్యకర్తలు తిక్కా రెడ్డి వస్తున్నాడని తెలిసి ఉదయం నుంచి పార్టీ జెండాలు చేత పట్టుకొని బాణసంచా పేలుస్తూ డ్రమ్స్ వాయిస్తూ తిక్కా రెడ్డి కి ఘనస్వాగతం పలికారు. కోసిగి గ్రామ శివారు నుండి తిక్కారెడ్డిని అంబులెన్స్లో నుండి ప్రచార రథం పైకి చేర్చి పైనుండి అభిమానులకు అభివాదం చేశారు.తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడి శివన్న, కోసిగి మాజీ సర్పంచ్ ముత్తిరెడ్డి తదితరులు తిక్కారెడ్డి వెంట ఆశేష జనవాహినిని మద్య రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలనాగిరెడ్డి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని పైగా రౌడీయిజం తో మా పై అఘాయిత్యం చేశారని అన్నారు.
కోసిగిలో తిక్కారెడ్డికి బ్రహ్మరథం పట్టిన అభిమానులు
ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని టిడిపిలో ఎటువంటి పదవి లేకపోయినా ఓడిపోయిన కూడా నేను నియోజకవర్గంలో మంత్రాలయం కోసిగి కౌతాలం పెద్దకడబూరు మండలాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి అబివృద్ది పథంలో నడిపించానని ఈ ఒక్క సారి నాకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపితే కోసిగి మండలం ఇంకా అభివృద్ధి చేసి మీ ఋణం తీర్చుకుంటానని అన్నారు.చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఈ పథకాలను అమలు జరగాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మంత్రాలయం నియోజకవర్గంలో నాన్ను ఎమ్మెల్యే గా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ఆయన అన్నారు. తిక్కారెడ్డి బార్య వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ నా భర్త పై కాల్పులు జరిపిన కూడా హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సిన తిక్కారెడ్డి మీకోసం మీ అభివృద్ధి కోసం ఎండలను కూడా లెక్కచేయకుండా స్ట్రెచర్పై వచ్చి మిమ్మల్ని మీ ఊర్లో ఓట్లు అభ్యర్థిస్తున్నారు .తిక్కా రెడ్డి కి ఓట్లు వేసి వేయించి గెలిపించి బాలనాగిరెడ్డి పై అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈసారి అసెంబ్లీకి పంపించే బాధ్యత మీ అందరిపై ఉందని ఈ ఒక్క సారి మాపై దయ చూపండి అని ఆమె కన్నీళ్లపర్యంతమయ్యారు. నా భర్తకు ఇలాంటి పరిస్థితి తెచ్చిన బాలనాగిరెడ్డికి ఈ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమే ప్రజలను వేడుకున్నారు. ఇంకా రెండు రోజుల సమయం ఉందని ఈ రెండు రోజుల్లోనే మీరు ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుధీర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.