ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 149 స్థానాల్లో ఆధిక్యంలో సాధించింది. అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. ప్రస్తుతం మూడు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఒక్క స్థానంలో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేశారు. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు. న్యూసువిధ యాప్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రతి రౌండ్‌కు ఫలితాలు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. మధ్యాహ్నం 12గంటలకు పార్టీల గెలుపోటముల సరళి తెలుస్తుందన్నారు.
149 స్థానాల్లో వైసీపీ విజయభేరి
✦ వైసీపీ భారీ అధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే 36 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ప్రస్తుతం వైసీపీ 112 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీలో ఉంది. టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొంది.. మరో 22 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
✦ విజేతలు వీరే..
వీఆర్ ఎలిజ (వైసీపీ) - చింతలపూడి
అలజంగి జోగారావు (వైసీపీ) - పార్వతీపురం
కోలగట్ల వీరభద్రస్వామి (వైసీపీ) - విజయనగరం
అంజద్ బాషా (వైసీపీ) - కడప
జోగి రమేశ్ (వైసీపీ) - పెడన
ఆదిమూలం (వైసీపీ) - సత్యవేడు
పి.రామచంద్రారెడ్డి (వైసీపీ) - పుంగనూరు
నవాజ్ బాషా (వైసీపీ) - మదనపల్లె
రామక్రిష్ణారెడ్డి పిన్నెళ్లి (వైసీపీ) - మాచర్ల
పేర్ని నాని (వైసీపీ) - మచిలీపట్నం
కె.అనిల్ కుమార్ (వైసీపీ) - పామర్రు
ధర్మాన ప్రసాదరావు (వైసీపీ) - శ్రీకాకుళం
వెంకట చిన అప్పలనాయుడు (వైసీపీ) - బొబ్బిలి
బొత్స అప్పలనర్సయ్య (వైసీపీ) - గజపతినగరం
ఆర్కే రోజా (వైసీపీ) - నగరి
నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ) - కుప్పం
జక్కంపూడి రాజా (వైసీపీ) - రాజానగరం
ఆదిరెడ్డి భవాని (టీడీపీ) - రాజమండ్రి సిటీ
నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ) - పెద్దాపురం
కోన రఘుపతి (వైసీపీ) - బాపట్ల
బోళ్ల బ్రహ్మనాయుడు (వైసీపీ) - వినుకొండ
ఎం.సుచరిత (వైసీపీ) - ప్రత్తిపాడు
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (వైసీపీ) - ప్రొద్దుటూరు
ఎం.రఘురామిరెడ్డి (వైసీపీ) - మైదకూరు
డాక్టర్ సురేష్ (వైసీపీ) - ఎర్రగొండపాలెం
కాకాని గోవర్థన్‌రెడ్డి (వైసీపీ) - సర్వేపల్లి
కొటారు అబ్బయ్య చౌదరి (వైసీపీ) - దెందులూరు
పుప్పాల శ్రీనివాసరావు (వైసీపీ) - ఉంగుటూరు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైసీపీ) - చంద్రగిరి
అరణి శ్రీనివాసులు (వైసీపీ) - చిత్తూరు
సత్య సూర్యనారాయణ రెడ్డి (వైసీపీ) - అనపర్తి
నంబూరి శంకర్‌రావు (వైసీపీ) - పెద్దకూరపాడు
డాక్టర్ జి.వెంకట సుబ్బయ్య (వైసీపీ) - బద్వేల్
వై.సాయి ప్రసాద్ రెడ్డి (వైసీపీ) - ఆదోని
మద్దిశెట్టి వేణుగోపాల్ (వైసీపీ) - దర్శి
ఆళ్ల నాని (వైసీపీ) - ఏలూరు
రవీందర్‌రెడ్డి (వైసీపీ) - కమలాపురం
అచ్చెన్నాయుడు (టీడీపీ) - టెక్కలి
Tags:
Andrapradeshnews