మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ కేంద్రాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ కేంద్రాలు


హైద్రాబాద్, మే 20  (way2newstv.com)  
మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ కార్లు, ఇతర వాహనాల చార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. మే 20వ తేదీ సోమవారం బేగంపేట వద్ద స్టేషన్‌ ప్రారంభమైంది. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు పెంచుతున్నట్లు...ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ద్వారా కి.మీ రూ. 2 ఖర్చవుతుందని..మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 24 మెట్రో స్టేషన్లలో మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు..మొబైల్ అప్లికేషన్స్‌లో పార్కింగ్ ముందుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు అనుసంధానంగా నడిచే బ్యాటరీ బస్సులు, కార్లు, టాక్సీల కోసం స్టేషన్లలో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది మెట్రో. 



మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌  చార్జింగ్‌ కేంద్రాలు

మెట్రోలో ప్రయాణించి చార్జింగ్ స్టేషన్లలో చార్జ్ చేసుకుని స్టేషన్ల నుంచి ఇంటికి, లేదా కార్యాలయాలకు రాకపోకలు సాగించే వీలుగా పలు చర్యలు తీసుకొంటోంది. విద్యుత్ నుంచి బ్యాటరీ చార్జింగ్ సెంటర్లు చార్జ్ అవుతాయి. ఇందులో 24 గంటలు ఇంధనం కొరత లేకుండా చూస్తున్నారు. ప్రతి కిలోమీటర్‌కు ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణిస్తే రూ.2 మాత్రమే ఖర్చవుతుంది. ఇక కారును చార్జింగ్‌ చేసుకునేందుకు 45 నుంచి ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. ఇతర రాష్ర్టాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ర్టాలలో వీటి వినియోగానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. దీని కారణంగా కాలుష్యం తగ్గుతుందని పేర్కొంటోంది. బ్యాటరీ చార్జింగ్ పోయినా ప్రత్యామ్నాయంగా డీజిల్ లేదా పెట్రోల్‌తో గమ్యస్థానానికి చేరుతాయి. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గుముఖం పట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన గుర్తింపునిస్తోందంటున్నారు.