విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తి కలిగించాల్సిన అవసరం వుందని తెలంగాణ గురుకుల విద్యాలయాల డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జర్నలిస్టు మురళీ మోహన్ రాసిన ‘రూల్స్ ఆఫ్ ది గేమ్’ పుస్తకాన్ని అయన సోమవారం ఆవిష్కరించారు.
క్రీడలను ప్రోత్సహించాలి
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడలలో పాల్గోంటే మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందని అన్నారు. క్రీడల వల్ల యువతలో పట్టుదల, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అన్నారు. హై స్కూలు విద్యార్ధి దశ నుంచే క్రీడల పట్ల ప్రోత్సహం అందించాలని తాము కృషి చేస్తున్నట్లు అయన అన్నారు.
Tags:
telangananews