ఒంటి మీద నూలు పోగు ఉన్నా చికాకే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒంటి మీద నూలు పోగు ఉన్నా చికాకే

లండన్, మే 15, (way2newstv.com)
బ్రిటీష్ కొలంబీయాకు చెందిన 27 ఏళ్ల నటుడు, నిర్మాత కైల్ డురాక్ జీవనశైలి తెలిస్తే తప్పకుండా షాకవ్వుతారు. ఒంటి మీద నూలు పోగు ఉన్నా చికాకుపడిపోతాడు. ఎప్పుడూ దుస్తులు లేకుండానే కనిపిస్తాడు. ఎందుకిలా అంటే.. అతడి దుస్తులంటే ఎలర్జీ అని, తాను బాల్యం నుంచే నగ్నత్వానికి బానిసయ్యానని చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి దుస్తులు విప్పి నిద్రపోవడం అలవాటైందని, తన తల్లిదండ్రులు నిద్రపోగానే దుస్తులన్నీ విప్పేసేవాడనని డురాక్ తెలిపాడు. ప్రస్తుతం తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దుస్తులు విప్పేసి స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు పేర్కొన్నాడు.


ఒంటి మీద నూలు పోగు ఉన్నా చికాకే

అంతేకాదు, తనలా నగ్నం తిరగాలని కోరుకునేవారు చాలామంది ప్రపంచంలో ఉన్నారని, పాలకులు ఇందుకు అనుమతి ఇవ్వాలని తెలిపాడు. ఈ నేపథ్యంలో తనలా నగ్నంగా బతికేవారి కోసం ఏదైనా చేయాలని తపిస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘దుస్తులంటే నాకు చాలా చిరాకు. కానీ, పనిలోకి వెళ్లేందుకు వేసుకోక తప్పడంలేదు. పనిచేసే ప్రాంతంలో కూడా ఎవరూ లేని చోటకు వెళ్లి దుస్తులు విప్పేసి రిలాక్స్ అవుతా. నాకు ఎప్పుడూ నగ్నంగానే ఉండాలని ఉంటుంది. ఇది కావాలని ఎంచుకున్నది కాదు. మనసుకు ఇష్టపడి చేస్తున్నది. ఒక వేళ దుస్తులు వేసుకుని ఎక్కువ సేపు ఉన్నానంటే.. నా శరీరంపై ఏవో పాకుతున్నట్లుగా ఉంటుంది. నా మెదడు చిట్లిపోతుందనే భావన ఏర్పడుతుంది. వెంటనే ఏదైనా నిర్మానుష్య ప్రాంతాన్ని చూసుకుని అక్కడ దుస్తులు విప్పేస్తా’’ అని తెలిపాడు. వెర్రి వేయి విధాలంటే ఇదే కాబోలు!!