కొలువు దీరిన 17వ లోకసభ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొలువు దీరిన 17వ లోకసభ

న్యూఢిల్లీ, జూన్ 18, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పదిహేడో లోక్‌సభ సోమవారం కొలువుదీరింది. తొలుత రాష్ట్రపతిభవన్‌లో సీనియర్ పార్లమెంటు సభ్యుడు వీరేంద్ర కుమార్‌‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అనంతరం లోక్‌సభ ప్రారంభమైంది. అనంతరం కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం ప్రారంభించారు. తొలుత ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం సభ్యుడు కేరళలోని మావిళికెర నుంచి ఎన్నికైన సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.ముందుగా కేంద్రమంత్రులు, ప్యానెల్‌ ఛైర్మన్ల ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు జరుగుతున్నాయి. అక్షరమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రమాణం కొనసాగుతోంది. ఏపీ ఎంపీలు తెలుగులోనే ప్రమాణం చేస్తున్నారు. అలాగే నరసాపురం వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు పంచకట్టులో సభకు వచ్చారు. సభలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమ, మంగళవారాలు కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు జరుగుతుండగా, బుధవారం స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 17 నుంచి జులై 26 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ సహా 10 బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను చట్టం రూపం తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది



కొలువు దీరిన 17వ లోకసభ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 25 మంది ఎంపీలు సోమవారం సభలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో మొదటగా అండమాన్‌ నికోబార్‌ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఏపీ ఎంపీల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ముందుగా తెలుగులో ప్రమాణం చేశారు. 12 మంది తెలుగులో, 11 మంది ఇంగ్లీషులో, ఇద్దరు హిందీలో ప్రమాణం చేశారు.
2. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడు హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
3. విజయనగరం వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
4. విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణం స్వీకరించారు.
5. అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
6. కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
7. అమలాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనురాధ హిందీలో ప్రమాణం స్వీకారం చేశారు.
8. రాజమండ్రి వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
9. నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
10. ఏలూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
11. మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
12. విజయవాడ టీడీపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
13. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
14. నర్సరావుపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
15. బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్‌ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
16. ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
17. నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
18. కర్నూల్ వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
19. అనంతపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య తెలుగులో పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
20. హిందూపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
21. కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.
22. నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
23. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.
24. రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
25. చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.