క్రేజీని క్యాష్ చేసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలు


విజయవాడ, జూన్ 1, (way2newstv.com)
ఇంజనీరింగ్‌ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లాలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల నిర్వాహకులు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల కాకుండానే సీట్లను బేరాలు పెడుతున్నారు.  కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వీనర్‌ కోటాలో కౌన్సెలింగ్‌ నిర్వహించిన తరువాత మేనేజ్‌మెంట్‌ సీట్లు భర్తీ కావాల్సి ఉంది. విద్యార్థులను మభ్యపెట్టి తమ కళాశాలలో గత కొన్నేళ్లక్రితం సాధించిన రిపోర్ట్స్ , ప్లేస్ మెంట్ సెల్ చూపించి..విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒప్పించి బలవంతంగా చేర్చుకుంటున్నారు. కొన్ని కళాశాలలు తమ వద్ద చదివితేనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ తగ్గిపోయినా, బయట కంపెనీల ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తమ కళాశాల వల్లనే ఉద్యోగం సాధించారని తెలియచేస్తూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ను ఆసరాగా చేసుకుని సీట్లు నింపుకుంటున్నారు.


క్రేజీని క్యాష్ చేసుకుంటున్న ఇంజనీరింగ్  కాలేజీలు
అయితే తల్లిదండ్రులు మాత్రం ఆయా కళాశాలల్లో చేర్చే సమయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.వాస్తవానికి ఇంజనీరింగ్‌ విద్యకు అంతగా డిమాండ్‌ లేకపోయినా, జిల్లాలో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ సీటు దొరికే అవకాశం ఉంది. అయితే కొన్ని కళాశాలల్లో కొన్ని బ్రాంచీలకు క్రేజీని చూపించి మేనేజ్‌మెంట్‌ సీట్లు ఇప్పటికే అయిపోయాయని ప్రచారం చేస్తున్నారు. దీనితో తమకు కావాల్సిన కళాశాలలో కౌన్సెలింగ్‌ ద్వారా సీటు రాదనుకున్నవారు ఆయా కళాశాలలకు వెళ్లి కావాల్సిన బ్రాంచి లక్షలు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పేరున్న కళాశాలలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా నాలుగు కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు ఇప్పటికే అన్ని ఇచ్చేశామని చెప్తున్నారు. నగరంలోనూ రాష్ట్రంలోనూ ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల సిఎస్‌ఇ బ్రాంచికి రెండు నుండి, మూడు లక్షలు మేనేజ్‌మెంట్‌ సీటును ఇస్తున్నారు. అలాగే మెకానికల్‌ బ్రాంచికి లక్ష నుండి లక్షన్నర వరకు పలుకుతుంది. అది కూడా ఇప్పుడే లేదని తమ వద్ద అన్నీ అయిపోయాయయని అడ్రస్‌, ఫోన్‌ నెంబరు ఇచ్చి వెళ్లండి తరువాత చెప్తామని అంటున్నారు.ఒక్క కృష్ణాజిల్లాలోనే అత్యధికంగా 34 ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో పది కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో అత్యధిక ఫీజులు చెల్లించి చదివేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా విజయవాడ పరిపర ప్రాంతంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ సీట్లను విక్రయించామని చెప్తున్నా, వాస్తవానికి మేనేజ్‌మెంట్‌ సీట్లు కూడా నిండని పరిస్థితి ఉందిని కళాశాలల నిర్వాహకులే చెపుతున్నారు. ఏది ఏమైనా కన్వీనర్‌ కోటా తరువాతనే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మేనేజ్‌మెంట్‌ సీట్లు కూడా భర్తీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Previous Post Next Post