ప్రజాసేవకు ప్రభుత్వం కట్టుబడివుంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రజాసేవకు ప్రభుత్వం కట్టుబడివుంది


శాసనసభలో గవర్నర్ నరసింహన్
అమరావతి, జూన్ 14  (way2newstv.com)
శుక్రవారం మూడవరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన గవర్నర్.. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షించి ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని స్ఫష్టం చేశారు. అలాగే,  రాష్ట్రంలో నవరత్నాల అమలుకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు అయన తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఫార్మర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 


ప్రజాసేవకు ప్రభుత్వం కట్టుబడివుంది

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నీటిని అందజేయడానికి చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వడ్డీలేని రుణాలు ఇస్తామని గవర్నర్  చెప్పారు.. అక్టోబర్నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు. రైతులకు వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు.బడుగు, బలహీన వర్గాల మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు అందజేస్తామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని తలసేమియా బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ ఇస్తామని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు  ఇస్తామన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కోన్నారు.   ప్రభుత్వ టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. టెండర్ల  వివరాలు  ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లో పెడతామని వివరించారు. తి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌, రూ.5 వేల గౌరవవేతనం అందిస్తామన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేశామని గవర్నర్‌ స్పష్టం చేశారు