కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఏర్పాట్లు


అమరావతి,జూన్ 07 (way2newstv.com
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు.  సెక్రటేరియట్ మొదటి బ్లాక్లో సీఎం జగన్ కార్యాలయం ఉంది.  శనివారం ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  


కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఏర్పాట్లు
ఉదయం 11.49 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.   సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది.   ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు.
Previous Post Next Post