అవంతి నైరాశ్యంలో ఉన్నారా.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవంతి నైరాశ్యంలో ఉన్నారా....

విశాఖపట్టణం, జూలై  22, (way2newstv.com)
నిన్నటి వరకూ కలసి ఉన్నందున ఏర్పడిన చనువో, లేక అతని గురించి బాగా తెలిసి ఉండి అన్నాడో ఏమో కానీ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. అవంతి శ్రీనివాస్ వైసీపీలో కుదురుగా ఉండలేకపోతున్నారని, ఆయన మనస్తత్వానికి టీడీపీ బెటర్ అని అంటున్నారు. ఆ విషయం చెప్పి వాసుపల్లి అటు టీడీపీ, ఇటు వైసీపీలకు ఒకే టైమ్ లో షాక్ ఇచ్చారు. దీనికి కారణం కూడా వాసుపల్లి చెబుతూ అవంతి శ్రీనివాస్ కి ఇచ్చిన పోర్ట్ ఫోలియో సరైనది కాదని, దాంతో ఎటువంటి ప్రాముఖ్యత లేని పదవిలో అవంతి శ్రీనివాస్ అసంత్రుప్తితో ఉన్నారని అన్నారు. మరి ఇందులో కొంత నిజం కూడా ఉందనిపిస్తోంది. 
అవంతి నైరాశ్యంలో ఉన్నారా....

అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు కానీ కీలకమైన శాఖలను కోరుకున్నారు. జగన్ మాత్రం టూరిజం శాఖను ఆయనకు ఇచ్చారు. ఈ శాఖలో పెద్దగా పనిలేకపోవడం వల్ల అవంతి శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారన్న వార్త కూడా అప్పట్లో ప్రచారం అయింది. మరి టీడీపీలో ఉన్న మనిషి కాబట్టి తన బాధను వాసుపల్లితో పంచుకుని కూడా ఉండవచ్చు. ఈ విషయన్ని బాహాటంగా వాసుపల్లి బయటపెట్టదమే ఇపుడు అసలైన విషయం.దీని మీద మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే ఖండించేశారు కూడా. తనకు చంద్రబాబు వైఖరి నచ్చకపోవడం వల్లనే టీడీపీ వీడను తప్ప మరోటి కాదని చెప్పుకొచ్చారు. తాను వైసీపీ మంత్రిగా పూర్తి హ్యాపీగా ఉన్నానని కూడా గట్టిగా చెప్పడం విశేషం. మళ్ళీ టీడీపీలోకి తాను వెళ్ళడం జరిగే పని కాదని కూడా అవంతి శ్రీనివాస్ కుండ బద్దలు కొట్టారు, ఇవన్నీ ఇలా ఉన్నా వాసుపల్లి అంత ధాటీగా ఎందుకు చెప్పారన్నదే ఇపుడు ప్రశ్న. జగన్ మంత్రుల్లో చాలామంది ఇప్పటికీ ప్రభుత్వ విధానాలను సభలో చెప్పలేకపోతున్నారు. తాము కూడా అర్ధం చేసుకోలేకపోతున్నారు. ప్రతీ దానికీ జగనే నిలబడి సమాధానం చెప్పాల్సివస్తోంది. ఇక అవంతి శ్రీనివాస్ లాంటి మంత్రులైతే నోటికి తాళమే వేసుకున్నారు. ఇవన్నీ ఆలోచించినపుడు మాత్రం ఈ మంత్రి గారిపై అనుమానాలు సహజంగానే వ్యక్తం అవుతాయి.ఇదిలా ఉండగా జగన్ సైతం అవంతి శ్రీనివాస్ కి పూర్తిగా నమ్మడంలేదని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ ఇప్పటికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో రిలేషన్లను కొన్సాగిస్తున్నారన్న సందేహాలు ఉన్నాయి. ఇక అవంతి శ్రీనివాస్ కి పెద్ద బాధ్యతనే జగన్ అప్పగించారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని ఆయన గెలిపించాలి. అది జరిగితేనే ఆయన మీద జగన్ కి గురి కుదురుతుంది. అపుడు శాఖల మార్పుల్లో పదోన్నతి కూడా దక్కుతుందని అంటున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ ఇలాగే అసంత్రుప్తితో ఉంటూ తన బాధను టీడీపీ నేతల వద్ద వ్యక్తం చేస్తే మాత్రం ఆయన మరింత ఇబ్బందులో పడతారని కూడా అంటున్నారు. ఇప్పటికే వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారికి న్యాయం జరగలేదన్న బాధ ఉంది. మరి అవంతి శ్రీనివాస్ తన మీద అనుమానాలను తొలగించుకుని పూర్తి స్థాయి వైసీపీ మనిషిగా పనిచేస్తారా లేదా అన్నది చూడాలి.