విజయవాడ జూలై 20 (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం నగరంలోని రీజినల్ పాస్ పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈసందర్భంగా డిప్లమేటిక్ పాస్ పోర్టును సీఎం దంపతులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదా ఉన్నవారికి కేంద్ర విదేశాంగ శాఖ డిప్లమేటిక్ పాస్ పోర్టును జారీ చేస్తుంది.
పాస్ పోర్టు ఆఫీసుకు సీఎం జగన్
గతంలో చంద్రబాబునాయుడికి ఈ పాస్పోర్టు జారీ చేయగా ఎన్నికలనంతరం ఆయన దానిని అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత జగన్ శనివారం విజయవాడలోని ఎంజీ రోడ్డులోగల రీజినల్ పాస్ పోర్టు కార్యాలయానికి చేరుకుని డిప్లమేటిక్ పాస్ పోర్టును తీసుకున్నారు