రాహూల్ గాంధీ రాజీనామా విషయంలో పునరాలోచించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాహూల్ గాంధీ రాజీనామా విషయంలో పునరాలోచించాలి


టి పిసిసి కార్యదర్శి గంప మహేందర్ రావు
సిద్దిపేట, జూలై 08 (way2newstv.com):
ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్గాంధీమరోమారుపునరాలోచించుకోవాలనిటి పి సి సి కార్యదర్శి గంప  మహేందర్ అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాలుగా పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.... ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకొని నిలబడడమే  నాయకుని లక్షణం అన్నారు. 

రాహూల్ గాంధీ రాజీనామా విషయంలో పునరాలోచించాలి

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి భవితవ్యం ఉందని రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఏ మాత్రం లబ్ధి చేకూరేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీనీ కూల్చివేయాలను కొనే నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ వహీద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు  ముద్దం లక్ష్మీ, చంద్ర శేఖర చారి  పలువురు పాల్గొన్నారు.