నెల ముంద నుంచే వినాయక విగ్రహాల తయారీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నెల ముంద నుంచే వినాయక విగ్రహాల తయారీ

తిరుపతి, జూలై 25, (way2newstv.com)
రాయలసీమలో వినాయక విగ్రహాల తయారీకి కేంద్రంగా మదనపల్లె మారింది. ఏటా కోట్ల రూపాయలు వ్యాపారం జరగడం విశేషం. అయితే మట్టితో కాకుండా పిఒపి రసాయనాలు కలిపి విగ్రహాలు తయారు చేయడం వల్ల మానవాళికే కాకుండా జీవరాశికి కూడా పెనుప్రమాదం పొంచి ఉంది. నిమజ్జనంతో ప్రతిఏటా జలకాలుష్యం పెరుగుతూ ఉంది. మదనపల్లె నుండి హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, బెంగుళూరు, చెన్నై లాంటి పట్టణాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఇది అన్ని వ్యాపారాల కంటే కొంతలాభసాటిగా ఉండటంతో ప్రతి ఏడాది మదనపల్లె కేంద్రంగా తయారీ కేంద్రాలు వెలుస్తూనే ఉన్నాయి. తయారీదారులు ప్రతి ఏడాది ఘణనీయంగా పెరుగుతున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వినాయకున్ని ప్రత్యేక దేవుడిగా పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 
 నెల ముంద నుంచే వినాయక విగ్రహాల తయారీ

అయితే ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు తెలిపిన మట్టి విగ్రహాలను ఆదరించే స్థానంలో ఆదునిక పోకడలను జతచేసి ప్లాస్టర్‌ ఆప్‌ పారిస్‌ (పిఓపి) విగ్రహాల తయారీ కోరలు చాచింది. దీంతో ఈ విగ్రహాల వలన పర్యావరణానికి హాని కల్గించడంతో పాటు మానవ, జల, జీవ చరాలకు ఏటేటా ముంపు పెరుగుతూ వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వంగానీ, అధికారులుగానీ దీనిపై నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారు. దీనిపై ప్రజలకు, భక్తులకు అవగాహన లేక పోవడం, మానవ అభిరుచులకు అనుగుణంగా తక్కున ఖరీదు, తక్కువ సమయంలో అందమైన కోరిన సైజులో విగ్రహాల లభ్యం కావడంతో ఈ విగ్రహాల ప్రత్యేకత. దీనికి తోడు విగ్రహాల తయారీదారులకు ఈ విగ్రహాలు మంచి లాభాలు రావడంతో ఇది మరింత వికృత రూపం దాల్చుతోంది. ఆరోగ్యవరం, ఎస్‌బిఐ కాలనీ, నీరుగట్టువారిపల్లి, కదిరిరోడ్డు, బెంగుళూరు రోడ్డు, పుంగనూరు రోడ్డుతో పాటు పట్టణంలో పలు చోట్ల ఈ యేడాది సెప్టెంబర్‌ నెలలో వచ్చే వినాయక చవితి పండుగకు ఇప్పటినుంచే విగ్రహాల తయారీ కార్యక్రమాలు ఉపందుకొన్నాయి. పిఒపి విగ్రహాల తయారీ సులభంగా వుండటం, విభిన్న అకృతులను తయారు చేయడంలో పిఒపిని వాడటం వలన తక్కువ ఖర్చుతో త్వరితగతిన తయారు చెసే వెసులు బాటుతో పాటు ఎంత పెద్ద సైజు విగ్రహాలునైనా సునాయాసంగా తయారు చేసుకొనే వీలుంది. అంతేకాక వీటిని తరలించడానికి కూడా అనువుగా ఉండటం మరో కారణం. రెండు గంటలకు ఒక్క వినాయక విగ్రహాన్ని తయారు చేసి అమ్మకానికి సిద్దం చేస్తున్నారు. ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలు పూర్తిగా వ్యాపార సంబంధాలుగా మారిపోవడం జరిగింది. దీంతో వ్యాపారం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. దీనిలో భాగంగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు వదిలారు. ఊపందుకొన్న పిఒపి విగ్రహాల తయారీని తగ్గించి పర్యావరణానికి, హాని కలగని రీతిలో వినాయకుడు విగ్రహాల తయారీని ప్రోత్సహించాల్సి వుంది. విగ్రహాల తయారీనే ఉపాదిగా మలుచుకొన్న వారి బతుకులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయ పద్దతుల్లో మట్టి విగ్రహాల తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రొత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అటు తయారీ దారులు, ఇటు భక్తులకు నిజమైన పండుగే.నిమజ్జనం చేస్తే పిఒపి విగ్రహాలు మునగవు నిమజ్జనం చేసిన పిఒపి విగ్రహాలు త్వరగా నీటిలో కరగక పోవడం వలన చెరువుల్లో వ్యర్థాలు పెరిగిపోయి మిగిలిన విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీలుకాదు. వాటిని జెసిబిలతో తొలగించి ముక్కలు చేసి కంపొస్టు యార్డులకు తరలిస్తారు. ఇకనైనా మన పూర్వీకులు తెలిపిన మట్టి విగ్రహాలనే పూజిస్తూ పిఒపి విగ్రహాల కోనుగోలును బహిష్కరించి నిజమైన వినాయకచవితి ఉత్సవాలను జరుపుకొని ప్రకృతిలో మమేకమవుదాం.మట్టి విగ్రహాలైతే తయారీలో కష్టమెక్కువ. రవాణాలో పగుళ్ళు వచ్చి విరిగిపోయే ప్రమాదం వుంటుందని ధర కూడ ఎక్కువగా వుటుందని తయారీ దారులు అంటున్నారు. దీని వలనే పిఒపి విగ్రహాల తయారీని ఎంచుకున్నట్లు పేర్కొంటున్నారు. మట్టి విగ్రహాలైతే నిమజ్జనం చేసిన గంటల వ్యవధిలోనే నీటిలో కరిగిపోతాయి. దీని వలన పర్యావరణానికి గాని, మానవాలికి గాని ఎలాంటి హాని జరగదు. ఈ విషయాన్ని పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరు గుర్తించి మట్టి విగ్రహాలనే ఎంచుకొని పర్యావరణాన్ని కాపాడాలి