అమరావతి, జూలై 31(way2newstv.in -Swamy Naidu)
రాష్ట్ర చరిత్రలో ఈ 14 రోజులలో జరిగిన అసెంబ్లీ ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసిన వ్యక్తిని వ్యక్తిగత దూషణ చేయడానికే ఈ సమావేశాలు పెట్టినట్లుగా ఉన్నదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంగళవారం అయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఏ చర్చ జరిగినా చివరికి అది చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు చేయడానికే అన్నట్లుగా సభ నడుపుతున్నారు. చివరకు సభలో ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చారు.
తిట్టడానికే శాసనభ సమావేశాలు
ప్రజలు 151 మందిని గెలిపిస్తే, చంద్రబాబు ను విమర్శించడానికి ఇంత ప్రజాధనం వృధా చేయాలా? గవర్నమెంటే మధ్యం షాపులు నడుపుతుంది అని చెపుతున్నారు, మధ్యం దుకాణాలు ఎక్కువగా ఉన్నవారంతా వైకాపా నాయకులే అని అన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ లుగా ఎమ్మెల్యే లను పెట్టినట్లు, మద్యం షాపులను కూడా వైకాపా నాయకులకే అప్పగిస్తారా. ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే ఎంత మంది ధర్నాలు చేస్తున్నారో, ఎంతమంది అసెంబ్లీ ని ముట్టడిస్తున్నారో చూస్తే మీ పరిపాలన అర్ధమవుతుంది. గత ప్రభుత్వం చేసిన వాటిపై ప్రతి దానికీ కమిటీలు వేస్తున్నారు. అసలు చంద్రబాబు అవినీతి చేస్తే కదా మీరు బయటకు తీయడానికి. మీరు ఎన్ని కమిటీలు అయినా వేయండి కానీ పరిపాలన మంచిగా చేయండని వెంకన్న అన్నారు.
Tags:
Andrapradeshnews