చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడే

చేసింది. ఇదిలా ఉండగా రోడ్డు జలమయం కావడం పాదచారులు రోడ్డు ఇరుపక్కల నడవడం 
రోడ్డును పట్టించుకోని నాయకులు
ప్రమాదాలు గురవుతున్న వాహనదారులు
వనపర్తి  జూలై 11 (way2newstv.com)
వనపర్తి జిల్లా గోపాల్ పేట బస్టాండ్ నుంచి సాకలి పల్లి వెళ్లే మట్టి రోడ్డును ఏ నాయకుడు పట్టించుకోకపోవడంతో చినుకు పడితే చాలు రోడ్డు అంతా బూడిద మయి వాహనాల వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా గోపాల్పేట బస్టాండ్ నుంచి సుమారు 300 ఫీట్లు ఉన్న ఈ మట్టి రోడ్డుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు గుండా సాకలి పల్లి, తూడుకుర్తి, శ్రీపురం మీదుగా నాగర్ కర్నూల్ కు ప్రతినిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి. 
చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడే

అంతేకాదు ఎంతోమంది కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు అందరు కూడా ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటా రే తప్ప ఈ రోడ్డుపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్ అంతా బురదమయం నడవటానికి నరకయాతన గా మారింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు అంతా జలమయమై వాహనాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  వచ్చి పోయే వాహనాల వల్ల బురద అంత వారిపై పడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు పరిచి ప్రతి ఒక్కరికి సౌకర్యం కల్పించాలని ఒకపక్క ప్రయాణికులు మరోపక్క ప్రజలు కోరుతున్నారు.