బెంగళూరు లో కొనసాగుతున్నరాజకీయ సంక్షోభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెంగళూరు లో కొనసాగుతున్నరాజకీయ సంక్షోభం


మంత్రి, నగేశ్‌ మంత్రి పదవికి రాజీనామా
బెంగళూరు జూలై 8 (way2newstv.com
ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ‘కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నా మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీని మీరు(గవర్నర్‌) ఆహ్వానిస్తే ఆ పార్టీకి నేను మద్దతిస్తాను’ అని నగేశ్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

బెంగళూరు లో కొనసాగుతున్నరాజకీయ సంక్షోభం

రాజీనామా అనంతరం నగేశ్‌ ఇప్పటికే ముంబయి చేరుకొని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జత కూడారు. అటు మరో మంత్రి, బీదర్‌ నార్త్‌ ఎమ్మెల్యే రహీమ్‌ ఖాన్‌ కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి సమాచారమిచ్చానని తెలిపారు. వారి కోసం త్యాగాలకు సిద్ధమైన కాంగ్రెస్‌ మంత్రులు మరోవైపు తిరుగుబాటు నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసమ్మతి నేతలను కేబినెట్‌లోకి తీసుకోవాలని యోచిస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ డీకే సురేశ్‌ చెప్పారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల రాజీనామా వెనుక భాజపా జాతీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ‘ఏ రాష్ట్రంలోనైనా భాజపా కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తుంటారు. భాజపా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోంది’ అని సురేశ్‌ దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది.