అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు

విజయవాడ, జూలై 12, (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలకు బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. డబ్బులు లేక ఓ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు

దీని ద్వారా 43మంది లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ స్కీమ్‌కు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టేందుకు ఆయన్ని చాలా ఒప్పించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించడం వెనుక ‘అమ్మఒడి’ పథకం పాత్ర ఎంతో ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,455.80కోట్లు కేటాయించారు. 
విద్యా రంగానికి సంబంధించి కేటాయింపులిలా.. 
⇨ విద్యాశాఖ: రూ.32,681.46 కోట్లు 
⇨ ఉన్నత విద్య: రూ.3021.63 కోట్లు 
⇨ మాధ్యమిక విద్య: రూ.29,772.79 కోట్లు 
⇨ జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు 
⇨ వైద్య ఆరోగ్యం: రూ.11399.23 కోట్లు 
⇨ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు.