తాడిపూడి ఎత్తిపోతల పథకానికి అడగడుగునా బ్రేక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తాడిపూడి ఎత్తిపోతల పథకానికి అడగడుగునా బ్రేక్

ఏలూరు, జూలై 10, (way2newstv.com)
గోదావరి జలాలతో మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకం పనులను కొన్ని చోట్ల అసంపూర్తిగా వదిలేయడంతో కాలువలు ఉన్నా ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లిఫ్టు-5 పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. కల్వర్టులు, తూరలు ఏర్పాటు చేసి కాలువలను అనుసంధానం చేసి సాగునీరు సరఫరా చేసే అవకాశం ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఆ పనులు ముందుకు సాగడం లేదు.ఈ ప్రాంతాలో భూగర్భజలాలు రానురాను అడుగంటుతున్నాయి. వందలాది అడుగుల లోతుకు బోరు వేస్తే గానీ నీరు రావడం లేదు. కాలువల నిర్మాణం పూర్తి చేసి నీరు వదిలితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు లేని కారణంగా సారవంతమైన భూములు ఉన్నా సరైన పంటలు పండించలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు.
తాడిపూడి ఎత్తిపోతల పథకానికి అడగడుగునా బ్రేక్

దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలనే యోచనతో తాడిపూడి ఉపలిఫ్టు- 5ను బంధపురం వద్ద ఏర్పాటు చేశారు. తాడిపూడి ప్రధాన కాలువ నుంచి 5.4 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి అక్కడి నుంచి మూడు ఉప కాలువల ద్వారా గోదావరి జలాలను పొలాలకు అందించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే బుచ్చియ్యపాలెం, అచ్చియ్యపాలెం, యాదవోలు, వెదుళ్లకుంట, వాదాలకుంట, చిన్నాయగూడెం పరిసర ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. లిఫ్ట్‌- 5 పరిధిలో మూడు ఉపకాలువల ద్వారా 12,915 ఎకరాలకు సాగు నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.తాడిపూడి లిఫ్ట్‌ 5 కాలువ కోసం ఈ ప్రాంతంలో రైతులంతా భూములు ఇచ్చారు. కాలువలు తవ్వినా వాటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. మా పొలం నుంచి కొంతమేర పంటకాలువ ఏర్పాటు చేశారు. దానిలోకి నీరు చేరే విధంగా ప్రధాన కాలువ నుంచి మార్గం ఇవ్వలేదు. దీనిలో నీరు వచ్చేలా చేస్తే ఈ ప్రాంత రైతులందరికీ మేలు జరుగుతుందిలిఫ్ట్‌- 5 పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా కాలువ పనులు మాత్రం కొలిక్కిరాలేదు. కొన్ని చోట్ల ప్రధాన కాలువ పనులు కూడా పూర్తికాలేదు. దీనికోసం సేకరించిన భూమికి తగిన పరిహారం చెల్లించాలంటూ కొందరు రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు నిలుపుదల చేశారు. వీటిని మినహాయిస్తే కొన్ని చోట్ల అసంపూర్తి పనులను పూర్తి చేస్తే నీరు ఇచ్చే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల నుంచి విమర్శలు వినబడుతున్నాయి.