ఖైరతాబాద్ గణేషుడి పనులను పరిశీలించిన మంత్రి తలసాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖైరతాబాద్ గణేషుడి పనులను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్, ఆగస్టు 26, (way2newstv.com
ఖైరతాబాద్ గణేష్ పనులను  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాం మోహన్,ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీస్ శాఖ,ఆర్ అండ్ బి,జిహెచ్ఎంసి ,ఇతర  ఉన్నతాధికారులు సోమవారం ఉదయం పరిశీలించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ 65 సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల, నుండి కూడా భక్తులు వస్తారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. అన్ని విధాలా అన్ని ఏర్పాట్లు చేస్తూ,కొన్ని ట్రాఫిక్ డైవెర్షన్ చేస్తాం. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 
ఖైరతాబాద్ గణేషుడి పనులను పరిశీలించిన మంత్రి తలసాని

విద్యుత్ శాఖ వారు లైట్స్,ఇతర సదుపాయాలు చేస్తున్నారు. వినాయక మంటపం చుట్టూ అద్భుతమైన బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. హెచ్ ఎండీఏ అధికారుల ఆధ్వర్యంలో లోతైన ప్రదేశంలో ఖైరతాబాద్ గణేష్ ను నిమజ్జనం చేస్తాం. ప్రపంచం హైదరాబాద్ వైపు  చూస్తుంది వినాయక నిమజ్జనం ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుంది. కరెంట్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు చెప్తున్నారు అన్ని మతాల పండుగలు అద్భుతమైన గా జరుగుతున్నాయి. నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు. మేయర్  బొంతు రామ్ మోహన్ మాట్లాడుతూ   ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లక్షలాది మంది భక్తులు వచ్చి  దర్శనం చేసుకుంటారు.  పోలీస్ శాఖ, జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో భద్రత కల్పిస్తామని అన్నారు. హుస్సేన్ సాగర్ లోతైన  ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేస్తాం. అందరూ భక్తులకు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.