చిదంబరంను విచారిస్తున్న సిబిఐ అధికారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిదంబరంను విచారిస్తున్న సిబిఐ అధికారులు

న్యూఢిల్లీ ఆగష్టు 22 (way2newstv.com
కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి చిదంబరం నాడు ప్రారంభించిన సీబీఐ కేంద్ర కార్యాలయ భవనానికి...నేడు అరెస్టు అయి రావడం చర్చనీయాంశంగా మారింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఆయనను ఉంచారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్‌ పూర్తయింది. రెండో రౌండ్‌ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఇంద్రాణీ ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 
చిదంబరంను విచారిస్తున్న సిబిఐ అధికారులు

కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది.తాను ప్రారంభించిన భవనంలోనే  విచారణకు..! నాటి యూపీఏ పాలనలో2008నవంబరు29వతేదీ నుంచి 2012జులై 31వతేదీ వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం 2011జూన్ 30వతేదీన ఢిల్లీలో సీబీఐ కేంద్ర కార్యాలయ భవనాన్ని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. తాను ప్రారంభించిన సీబీఐ కేంద్ర కార్యాలయానికే చిదంబరం అరెస్టు అయి రావడం కాకతాళీయమే అయినా కేంద్రంలో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కావడంతో సీన్ రివర్స్ అయిందని చర్చలు సాగుతున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు చిదంబరంను బుధవారం రాత్రి అరెస్టు చేసి సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఈ ప్రాంతం వద్ద భద్రతను మరింత పెంచారు. చిదంబరం అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపడుతుండటంతో విచారణకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.