బీజేపీలోకి ద్వితీయ శ్రేణి నాయకులే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీలోకి ద్వితీయ శ్రేణి నాయకులే...

గుంటూరు, ఆగస్టు 22, (way2newstv.in)
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరు. అది వాస్తవం. వెళితే అధికారపార్టీ వైసీపీలోకి వెళ్లాలనుకున్నా జగన్ రాజీనామా చేసి రావాలనడంతో వైసీపీలోకి వెళ్దామనుకున్న కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గారు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినప్పటికీ వారు ఆ పార్టీ వైపు చూడటం లేదు. అయితే బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ చేరితేనే రాష్ట్రంలో బీజేపీకి ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ పార్టీ మారితే అనర్హత వేటు వేసే అవకాశముండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ వైపు చూడటం లేదు.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పక్కాగా బీజేపీలోకి వెళ్లాలని భావించారు. కానీ బీజేపీలో తాను చేరగానే అనర్హత వేటు పడుతుంది. 
బీజేపీలోకి ద్వితీయ శ్రేణి నాయకులే...

ఈ సంగతి ఆయనకు తెలియంది కాదు. ఐదేళ్లు జగన్ ను వ్యక్తిగత దూషణలు చేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు వేస్తారు. అందుకోసమే వైసీపీ నేతలు కాచుక్కూర్చున్నారు. అయితే రాజీనామా చేసి మరీ పార్టీ మారడం వృధా అన్నది గంటా శ్రీనివాసరావు ఆలోచన.తాను రాజీనామా చేసినా, అనర్హత వేటు పడినా ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. మొన్నటి ఎన్నికల్లోనే చచ్చీ చెడీ గెలవాల్సి వచ్చింది. నియోజకవర్గం మార్చినా అరకొర మెజారిటీతోనే గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఉప ఎన్నిక అంటూ జరిగితే ఈసారి మళ్లీ వైసీపీదే పైచేయి అవుతుంది. అందుకే ఈ లెక్కలన్నీ చూసుకుని గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉండాలని డిసైడ్ అయ్యారట.ఏపీలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 20వ తేదీతో ముగిసింది. సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చేరికలపై దృష్టి పెట్టనుంది. అయితే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీ టచ్ లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే రెడీ అయిపోయారు. ఆయనతో పాటుగా మరికొందరు రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశముంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన వారు, ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే కాషాయ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుకొందరు బీజేపీ చేరతారన్న ప్రచారం మాత్రం ప్రస్తుతం నిజమయ్యే అవకాశాలు లేవు.