నెల్లూరు, ఆగస్టు 28 (way2newstv.com)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించినట్లు ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డితో పాటూ మరో ముగ్గుర్ని ఈ కేసులో నిందితులుగా చేర్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 58-3లో 2.40 ఎకరాల భూమి ఉందట. ఈ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని.. తర్వా ఆ భూమిని మరొకరికి అమ్మేసినట్లు ఫిర్యాదు అందింది.
చిక్కుల్లో సోమిరెడ్డి
అక్రమంగా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారని.. సోమిరెడ్డిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఈ భూముల వ్యవహారం కోర్టుకు చేరడంతో.. సోమిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో చంద్రమోహన్‌రెడ్డితో పాటూ పొలాలను కొనుగోలు చేసిన మేఘనాథన్, జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఈ కేసు వ్యవహారంపై సోమిరెడ్డి స్పందించలేదు. ఆయన లాయర్లతో చర్చించి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:
Andrapradeshnews