బిస్కెట్ల గోడౌన్ లో ఆగ్ని ప్రమాదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిస్కెట్ల గోడౌన్ లో ఆగ్ని ప్రమాదం

విజయవాడ, ఆగస్టు 3, (way2newstv.com)
కృష్ణా జి్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడు పరిధిలో బ్రిటానియా బిస్కెట్స్ గోడౌన్ అగ్నికి అహుతయ్యింది. ఉదయం 2.30 గంటల సమయం బిస్కెట్స్ లోడ్తో వచ్చిన లారీ డ్రైవర్.. వైర్లు కాలుతున్న వాసన రావడంతో వాచమేన్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే వాచ్మేన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.  కర్ణాటక, మహారాష్ట్ర లలో తయారయ్యే బిస్కట్లు, ఇక్కడ నిల్వ చేసి, ఇక్కడ నుండి రాష్ట్రం మొత్తం డెలివరీ ఇస్తారు. 
బిస్కెట్ల గోడౌన్ లో ఆగ్ని ప్రమాదం

సుమారు 3.5 ఎకరాల్లో ఈ గోడౌన్ విస్తరించి ఉంది. ఈ గోడౌన్ ను ఈ ఏడాది జూన్ మాసం లో ప్రారంభించారు.  ఈ గోడౌన్ నిర్మాణ వ్యయం సుమారు రూ.3 కోట్లు కాగా ఇందులో ఏపాటు చేసిన సరుకు విలువ రూ. 2-3 కోట్ల మేరుకు ఉంటుంది అంటున్నారు.  రాత్రి 7.30 గంటల వరకు గోడౌన్ లో పలు వెల్డింగ్ పనులు జరిగాయని వాచ్ మెన్ తెలిపాడు.  గోడౌన్ నిర్మాణ ఖర్చు 2రూ 3 కోట్లు కాగా. అందులో బిస్కెట్స్ ఖర్చు రూ. 2-3కోట్ల మేరకు ఉంటుంది అని అం చనా వేస్తున్నారు.   సంఘట నా స్థలానికి చేరుకున్న జిల్లా ఫైర్అసిస్టెంట్ ఆఫీసర్ శేఖర్, కంకిపాడు పోలీసులు వివరాలు సేకరించారు.  గన్నవరం, ఉయ్యురు, ప డమట లకు చెందిన ఫైర్ ఇంజిన్లలో మంటలను  అదుపు చేసారు.