తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కబోకు... కేశినేని నాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కబోకు... కేశినేని నాని

విజయవాడఆగష్టు 22 (way2newstv.com
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మార్పు ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌ మరో తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదని భవగంతుణ్ని కోరుకుంటున్నానంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు జగన్ మళ్లీ అదేపని చేసి తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదన్నారు.
 తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కబోకు... కేశినేని నాని

మరోవైపు తాము ఏంచేసినా.. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేస్తున్నామన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారంటూ ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధానిని అడ్డు పెట్టుకోవడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు