అభిమాని కోరిక తీర్చిన జనసేనాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అభిమాని కోరిక తీర్చిన జనసేనాని

ఒంగోలు, ఆగస్టు 20  (way2newstv.com):
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు తన అభిమాని పాతకూటి బూడిగయ్యను పరామర్శించారు. కేన్సర్ తో బాధపడుతున్న బూడిగయ్యను జనసేన నేతలు పార్టీ ఆఫీసుకు తీసుకురాగా, ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యఖర్చుల కోసం రూ.లక్ష నగదును అందజేశారు. బూడిగయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వినాయకుడి విగ్రహాన్ని అందజేశారు.
అభిమాని కోరిక తీర్చిన జనసేనాని 

ప్రకాశం జిల్లా అన్నసముద్రానికి చెందిన బూడిగయ్య పవన్ కల్యాణ్ వీరాభిమాని. కేన్సర్ వ్యాధి సోకినా కిమో చికిత్స తీసుకుంటూ ఆయన జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో పవన్ కల్యాణ్ ను చూడాలని ఉందని స్థానిక జనసేన నేతలను కోరారు. ఈ విషయాన్ని పవన్ కు చెప్పగా, తానే వస్తానని జనసేనాని చెప్పారు. అయితే జనసేన నేతలు బూడిగయ్యను హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని జనసేన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడే పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు.