స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు

విజయవాడ, ఆగస్టు 20  (way2newstv.com):
ఏపీలోని 714 మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో స్వరాష్ట్రానికి రానున్నారు. అంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న మూడో, నాలుగో తరగతి ఉద్యోగులను పంపిచేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి ఆగస్టు 19, 2019 సోమవారం లేఖ రాశారు. 
స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు

ఏపీ సచివాలయంలో పని చేస్తున్న 176 మంది, శాఖాదిపతుల కార్యాలయాల్లోని 538 మంది ఉద్యోగులను శాశ్వతంగా లేదా డిప్యుటేషన్ పై పంపించడానికి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎస్. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. చాలా మంది ఏపీలో పని చేయడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ఇల్లు, కుటుంబాలు ఉన్నందున అక్కడికే వెళ్లి పని చేస్తామని కోరారు. అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలకు వినతి ప్రతాలు సమర్పించారు.ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.