30 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అమరావతి సెప్టెంబర్ 21  (way2newstv.com):
ఈ నెల 30 నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో
అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో ఏవీ ధర్మారెడ్డిలు ఆహ్వానించారు. 
30 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన వారు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆయననుఆహ్వానించారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Previous Post Next Post