మాజీ మంత్రి చందులాల్ ఆశీర్వాదం కోరిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాజీ మంత్రి చందులాల్ ఆశీర్వాదం కోరిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు సెప్టెంబర్ 10 (way2newstv.com)
సత్యవతి రాథోడ్  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాజీ గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ ని మర్యాద పూర్వకంగా కలిసి వారి దంపతుల ఆశీర్వాదం కోసం స్వయంగా అతనునివాసం ఉంటున్న హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది .
మాజీ మంత్రి చందులాల్  ఆశీర్వాదం కోరిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండవసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ యస్  పార్టీ ముఖ్యమంత్రికేసీఆర్  తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో సెప్టెంబర్ 8న   విస్తరించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే కేసీఆర్  మంత్రివర్గంలో తొలిసారిగా ఒక గిరిజన మహిళ,మంత్రిగా సత్యవతి రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి గిరిజన మహిళను గిరిజనశాఖ మంత్రిగా నియమించలేదు కానీ నాపై ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ కి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  మంత్రి  సత్యవతి రాథోడ్ వెంట మహా-బాద్ జిల్లాపరిషత్ చైర్మన్ అంగోత్ బిందు మరియు వారి అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.