న్యూ డిల్లీ సెప్టెంబర్ 20 (way2newstv.com)
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) డబ్బును.. దివాళా తీసిన కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. దీంతో ఎల్ఐసీ సంస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా కేంద్రప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. ట్విట్టర్‌లో ప్రియాంకా స్పందించారు.
దివాళా తీసిన కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నఎల్ఐసీ
గత రెండున్నర నెలల్లో ఎల్ఐసీ సుమారు 57వేల కోట్లు నష్టపోయినట్లు ప్రియాంకా తన ట్వీట్‌కు ఓ మీడియారిపోర్ట్‌ను ట్యాగ్ చేసింది. భారత్‌లో విశ్వాసానికి మరోపేరు ఎల్ఐసీ, భవిష్యత్తు భద్రత కోసం పేద ప్రజలు తమ సొమ్మును ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ బీజేపీ ప్రభుత్వం ఆ ఎల్ఐసీ డబ్బును..నష్టపోయిన కంపెనీల్లో పెట్టుబడి పెడుతోందని ప్రియాంకా అన్నారు. ఇదేం విధానం, ఇది కచ్చితంగా నష్టపోయే విధానమే అని కాంగ్రెస్ నేత అన్నారు.
Tags:
all india news