షాద్ నగర్ లో మంత్రి తలసాని పర్యటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

షాద్ నగర్ లో మంత్రి తలసాని పర్యటన

షాద్ నగర్  సెప్టెంబర్ 13, (way2newstv.com)
ప్రభుత్వ ప్రొజెన్ సెమెన్ బుల్ స్టేషన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు  పశు సంవర్ధక మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య,  జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపిపి ఖాజా అహ్మద్ ఇద్రీస్ తదితర అధికారులు పాల్గోన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్ నగర్మండలం కంసాన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రొజెన్ సెమెన్ బుల్ స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 
షాద్ నగర్ లో మంత్రి తలసాని పర్యటన

నిర్మాణ పనుల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. 36 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్టు వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి రైతుల అవసరాల కోసం కరీంనగర్ ప్రొజెన్ సెమెన్ బుల్ స్టేషన్ ను ఆశ్రయించడం జరుగుతుందని తెలిపారు. కంసాన్ పల్లిలో బుల్ స్టేషన్ ఏర్పాటైతే మహబూబ్ నగర్ , రంగారెడ్డి తదితర జిల్లాల రైతులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ లను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపిపి ఖాజా అహ్మద్ ఇద్రీస్, ఎమ్మె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు