హైద్రాబాద్, సెప్టెంబర్ 11 (way2newstv.com)
గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ సిద్దమైంది. కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు. ఫుట్ పెట్రోలింగ్, వాచ్ టవర్లతో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం మూడు కమిషనరేట్లలో 60 వేల మండపాలకు భద్రత, నిమజ్జానానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో రేడీ అయ్యారు పోలీసులు.హైదరాబాద్‌లో మూడు, నాలుగు రోజులు జరిగే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దం చేశారు పోలీసులు. ఈ నెల 12న జరిగే ప్రధాననిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఇందుకు అప్రమత్తమయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతోనిఘా, రూఫ్‌టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్‌టవర్ల ఏర్పాట్లకు కృషి చేస్తున్నారు. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్‌చేసుకుంటున్నారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
నిమజ్జనానికి అంతా సిద్ధం
మూడు కమిషనరేట్లలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. స్టాండ్ టూ స్టే నిప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్ చేశారు. ప్రస్తుతపరిస్థితులు.. అందుబాటులోని సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు.కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులుజరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతో పాటు కీలక మండపాలను ప్రతి రోజు బాంబు స్క్వాడ్ లు తనీఖీలు చేస్తున్నారు. మండపాలవద్ద ఉండే వలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల్ని గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 62వేల మండపాలు ఏర్పాటు చేశారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్ కమిషనరేట్ లో 10,702 మండపాల ఏర్పాటుకు అనుమతితీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయినవే ఉన్నాయి. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేస్తున్న అనుమతి తీసుకోవట్లేదు.పోలీసులు ముఖ్యంగాబాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 18 కిలోమీటర్ల ప్రధాన దారితో పాటు సబ్‌రోడ్లపై అధికంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో మొత్తం 120 కిలోమీటర్ల దారిలో విగ్రహాలు నిమజ్జనానికితరలివెళ్లనున్నాయి. హైదరాబాద్ లో పోలీస్ కమిషనర్‌తో పాటు నలుగురు అదనపు సీపీలు, 9 మంది డీసీపీలు, 20 మంది అదనపు డీసీపీలు, 64 మంది ఏసీపీలు, 244 మంది ఇన్‌స్పెక్టర్లు,618 మంది ఎస్‌ఐలు, 636 మంది ఏఎసైలు, 1700 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 7,198 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 680 మంది ఎస్‌పిఓలు, 6000 మంది హోంగార్డులతో మొత్తం 17వందలకు పైగా పోలీసులు నిమజ్జనం జరిగే రోజు విధుల్లో ఉంటారు. ఇతర విభాగాల నుంచి ఐదుగురు ఐజీలు, ఒక డీఐజీ, 19 మంది ఎస్పీలు, 53 మంది డీఎస్పీలు, 128 మంది సీఐలు, 129మంది ఎస్‌ఐలు, 15 మంది మహిళా ఎస్‌ఐలు, 1,336 మంది ఏఎసైలు, 5,239 పోలీస్ కానిస్టేబుళ్లు, 250 మహిళా కానిస్టేబుళ్లు, 1,426 మంది హోంగార్డులు కూడా బందోబస్తులోఉంటారు. వీటికి తోడుగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటాయి. సిటీకి సంబంధించిన లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్‌బీ, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సిటీఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఇక పోలీసు వాహనాలతో పాటు ఎమర్జన్సీ రెస్పాన్స్ టీంలు, వజ్ర వాహనాలు, గ్యాస్ స్క్వాడ్, వాటర్ కెనాన్లు, క్యుఆర్‌టిలు బందోబస్తులో ఉంటాయి.16 బాంబు డిస్పోజబుల్ బృందాలు, 2 యాసెస్ కంట్రోల్ బృందాలు, 22 డాగ్‌స్క్వాడ్ బృందాలు, బాంబు డిటెక్టర్లు, అండర్ క్యారియెజ్ మిర్రర్‌లు, డోర్‌ఫ్రేం మెటల్ డిటెక్టర్‌లతో చెకింగ్ కొనసాగుతుంది.సుమారు 700 ప్రాంతాలు. సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. ఉన్నతాధికారుల సందర్శన, ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నామన్నారు.బందోబస్తుతో పాటు ట్రాఫిక్ విభాగం కీలకం. ప్రధానయాత్ర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో సమీక్షిస్తుండాలి. హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రాంతాలు, రాజన్నబౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట, షేక్‌పేట్ నాలా, సరూర్‌నగర్ చెరువు, మల్కాజిగిరిట్యాంక్, హస్మత్‌పేట్ లేక్‌లలో నిమజ్జనాలు జరుగనున్నాయి. సుమారు 17 లక్షల మంది నిమజ్జనంలో పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ వద్ద50కి పైగా క్రేన్లను ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 12 క్రేన్లను అమర్చి, 4 రిజర్వ్‌లో ఉంచుతారు. ట్యాంక్‌బండ్ వద్ద 24 క్రేన్లు అమర్చి 2 రిజర్వ్‌లో ఉంచారు. మినిస్టర్ రోడ్ వద్ద 3 లేదానాలుగు, రాజన్నబౌలి వద్ద 3, మీరాలం ట్యాంక్ వద్ద 2, ఎర్రకుంట వద్ద 2 క్రేన్లు అందుబాటులో ఉంటాయి. గతేడాది నుంచి ప్రవేశపెట్టిన ప్రత్యేక రిలీజ్ హుక్‌లు 160 అందుబాటులో ఉన్నాయి. ఇకపోలీస్ అధికారుల మధ్య కమ్యూనికేషన్ ఇబ్బందులు రాకుండా నగరంలో ఉన్న 3 వేల వైర్‌లెస్ సెట్లతో పాటు అదనంగా మరిన్ని సెట్లు సమకూర్చారు. 35 ప్రాంతాల్లో బ్యాటరీ చార్జింగ్ పాయింట్లుఅమర్చారు. 11 కమ్యూనికేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 236 ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ సహకారంతో సింగిల్, డబుల్ బారికేడింగ్ చేస్తున్నారు. గుర్తులు, రూట్‌లు తెలిపేందుకు 2000 చోట్లసైనేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.. 4 మౌంటెడ్ కెమెరాలు బాలాపూర్, చార్మినార్, ఖైరతాబాద్‌గణేష్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితిలో 20 అంబులెన్స్‌లు,15 ఫైర్ సర్వీసు వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు.