ఏలూరు, అక్టోబర్ 19, (way2newstv.com)
పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేసుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా మంజూరుచేసి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ధరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న వాటిని సకాలంలో అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిబంధనలు పాటించని ధరఖాస్తులను తగు కారణాలతో తిరష్కరించి సంబంధిత పారిశ్రామికవేత్తలకు తెలియచేయాలని చెప్పారు.
పరిశ్రమలకు సింగిల్ విండో విధానం
అలాగే ఏర్పాటుచేసిన పరిశ్రమలు నిబంధనల మేరకు నిర్వహిస్తున్నధీ లేనిదీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ఇన్సెంటివ్లకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ స బ్సిడీ ప్రతిపాదనలను స్క్రూటినీ చేసి నివేదిక పంపాలని పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఎం మురళీమోహన్ కు కలెక్టర్ ఆదేశించారు. కోర్టుకేసులకు విషయంలో కోర్టు ఆదేశాలఅమలులో నిర్లక్ష్యం తగదని, కోర్టు ఆర్దర్లను క్షుణ్ణంగా చదివి తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పరిశ్రమలకు సంబంధించి నమోదైన కేసులు, కోర్టు ఆదేశాలు తదితర అంశాలను కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు పరిశీలించారు. సింగిల్ డెస్క్ విధానంలో పెండింగ్ లో వున్న 4 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేవిషయంలో నిర్దీతకాలంలో తగు నిర్ణయంతీసుకోవాలన్నారు. అంతేగాని పారిశ్రామిక వేత్తలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలస్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రమికవేత్తలకు తగు సహాయసహకారాలు అందించి పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించాలని జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందేలా అధికారులు తమ వంతు కృషిచేయాలని కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు అధికారులకు సూచించారు.