విజయవాడ, అక్టోబరు 1, (way2newstv.com)
శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా సాక్షాత్కించారు. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి ... ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది.
ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం...
పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు.