ఆర్ టి సి అక్కడ కార్మికులకు టీడీపీ మద్దతు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్ టి సి అక్కడ కార్మికులకు టీడీపీ మద్దతు

అసిఫాబాద్ అక్టోబర్, 12 (way2newstv.com)
టి యస్ ఆర్ టి సి కార్మికులకు మద్దతుగా  ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్లపల్లి  ఆనంద్   ఆధ్వర్యములో  నాయకులు కార్మికులని కలిసి వారి న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయములో ఆర్.టి.సి ఉద్యోగులు, కార్మికులు కీలక భూమిక పోషించారని, తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్.టి.సి ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ఉద్యమ సమయంలో కే. సి.ఆర్ హామీ ఇచ్చి మర్చిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 
ఆర్ టి సి అక్కడ కార్మికులకు టీడీపీ మద్దతు

ఆర్.టి.సి ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని , అది ప్రభుత్వ విధానం కాదని, టి.ఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో విలీనం గురించి పేర్కొనలేదంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్మికులను, ఉద్యోగులను కించపరిచే విధంగా మోసపూరితంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంథాలకు పోకుండా ఆర్.టి.సి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.