ముంబై, అక్టోబరు 21 (way2newstv.com)
బంగారం ధర దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు క్షీణించింది. గత నెలలో బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,950 తగ్గింది. అదేసమయంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కూడా తగ్గింది. వెండి ధర కేజీకి 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కి పడిపోయింది. ‘‘బంగారం ధర ఒక రేంజ్‌బౌండ్‌లో కదలాడవచ్చు. కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి ఆందోళనలు వంటి వాటి కోణంలో చూస్తే బంగారం ధర పైకి కదిలే అవకాశముంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది.
మళ్లీ తగ్గిన బంగారం ధరలు
చైనాలో ఆర్థిక వృద్ధి అంచనాల కన్నా ఎక్కువగానే తగ్గింది. మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. చైనా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ రిటైల్ సేల్స్ డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జీడీపీ వృద్ధి అంచనాలకు దిగువునే ఉంది. బ్రెగ్జిట్ డీల్‌కు అవకాశం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి వంటి అంశాలు అమెరికా డాలర్ ఇండెక్స్ ఆగస్ట్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో బంగారం ధరకు సపోర్ట్‌కు లభించింది.ధంతేరాస్, దీపావళి నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరగొచ్చని జువెలర్లు విశ్వాసంతో ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో బంగారం ధరల తగ్గుదల కూడా డిమాండ్ పెరుగుదలకు దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగో గోల్డ్ బాండ్లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 1,493.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 17.57 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.