గుంటూరు, డిసెంబర్ 2, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అమలుకు అధికారులు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాలో 6.98 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరిలో సోమవారం సాయంత్రం వరకూ 11.90 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.గంగాభవానీ తెలిపారు. చైల్డ్‌ఇన్‌ఫో, అమ్మఒడి వెబ్‌సైట్‌లో ఇంకా ఎనిమిది వేల మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియకు శనివారం సాయంత్రం తుది గడువుగా ప్రభుత్వంనిర్ణయించింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
అమ్మ ఒడి కోసం ప్రయత్నాలు
ప్రతి విద్యార్థి పుట్టిన తేదీ ధ్రువపత్రం, స్టడీ సర్టిఫికెట్, విద్యార్థుల ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, తల్లి బ్యాంకు ఖాతాతో పాటు తల్లి ఆధార్ కార్డుతో పాటు వారి ఫోన్ నంబర్లను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ సేకరించారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించేందుకు 10 రోజులుగా నానా హైరానా పడ్డారు. తొలి దశలో ఫోన్ నంబరు అడగలేదు. అయితే ఫోన్ నంబరు తప్పనిసరని, ఈ ఫోన్ నంబరు ఆధార్‌కు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం ఉండాలని ఆంక్షలు పెట్టడంతో అటు తల్లులు, ఇటు ఉపాధ్యాయులు చివరిదశలో విపరీతమైన టెన్షన్ పడ్డారుమరోవైపు ఆన్‌లైన్‌లో నెట్ సర్వర్ పనిచేయక ఉపాధ్యాయులకు తీవ్ర చికాకు కల్పించింది. దీంతో 19 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ వరసగా 11 రోజులుగా గడువు పొడిగిస్తూ వచ్చారు. 99 శాతం వివరాలునమోదు పూర్తి కావడంతో శనివారం తుది గడువుగా ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకూ ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. దీని ప్రకారం 2019-20లో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఆధార్‌తో అనుసంధానం అయ్యారు. ఆధార్‌తో అనుసంధానం లేని వారి వివరాలను విడిగా సేకరిస్తున్నారు. వీరి సంఖ్య దాదాపు ఐదారు వేలుంటుందని అంచనా.ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో 3.56 లక్షల మంది విద్యార్థులుండగా ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 3,50,746 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తంగా గతేడాది కంటే 60 వేల మంది విద్యార్థులు పెరిగారు. ఒక తల్లికి ఎంత మంది పిల్లలున్నా రూ.15 వేలు మాత్రమే చెల్లించడం వల్ల విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేదని తల్లుల వివరాలే ప్రమాణికంగా తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించి దాదాపు 3.70 లక్షల మందికే 'అమ్మఒడి' వర్తించే అవకాశం ఉందని తెలిసింది. చెబుతున్నారు. విద్యార్థులు వివరాలు ఆన్‌లైన్‌లో పూర్తి చిరునామాతో నమోదైన తర్వాత వారి తల్లుల వివరాలను పరిశీలించే బాధ్యతను గ్రామ, వార్డు వాలంటర్లకు అప్పగించారు. వాలంటీర్లు 'అమ్మఒడి' అమలు కోసం సేకరించే వివరాలతో పాటు పలు సామాజిక వర్గాల వారికి అందుతున్న ఉపకార వేతనాల వివరాలూ నమోదు చేసుకుంటున్నారని తెలిసింది.