ప్రయివేటు స్కూల్స్ ను విస్మరించం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రయివేటు స్కూల్స్ ను విస్మరించం

హైదరాబాద్ డిసెంబర్ 28  (way2newstv.com)
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్క్స్ మేనజ్మెంట్ అసోషియేషన్ (ట్రస్మా)  ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2019 ను  ఆర్థిక మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ట్రస్మా  ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమం లో ట్రస్మా సహకారం గొప్పది. తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరమో ఉద్యమం సమయంలో ట్రస్మా చాటిచెప్పింది. ప్రయివేట్ స్కూల్స్ కు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ టాక్స్ తగ్గింపు, శిక్షణ కేంద్రానికి స్థలం కోరారు. సీఎంకి ఈ సమస్యలు విన్నవిస్తానని అన్నారు. 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్  చదివితే, 33 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు స్కూల్స్ లోచదువుతున్నారు. ప్రయివేటు స్కూల్స్ ను విస్మరించే పరిస్థితిలేదు. 
ప్రయివేటు స్కూల్స్ ను విస్మరించం

పిల్లలకు విద్యతో పాటు నాలుగు లక్షల మంది కి ప్రయివేటు స్కూల్స్ ఉపాధినిస్తున్నాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా  విద్యా విధానంలో మార్పులురావాలి. పిల్లలకు నాణ్యమైన విద్య ఎంత అవసరమో....విలువలతో కూడిన విద్య అంతే అవసరం. ప్రపంచాన్ని మార్చే శక్తి గల ఆయుధం విద్య.  విద్య అంటే ర్యాంకులు, మార్కులుగా భావించవద్దు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, ప్లాసిక్ రహిత సమాజం పట్ల అవగాహన, మొక్కల పెంపకం, సమయ పాలన నేర్పాలని మంత్రి సూచించారు. దేశానికి శక్తిగల సమాజాన్ని అందించగలిగేది విద్యాలయాలే. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న ఈ సమయంలో మన సంస్కృతి గొప్పతనం తెలియజేయాలి సోషల్ మీడియా కు పిల్లలను బానిసలు కాకుండా చూడాలి. మార్కులు రాకపోతే జీవితం కోల్పోయినట్లే అన్న భావన పిల్లల్లోరానివ్వద్దు. విపత్కర పరిస్థితులను తట్టుకునేలా పిల్లలను తీర్చిదిద్దండి. విద్యాలయాలనుంచే పిల్లలకు దేశ చట్టాలు, విలువలపై అవగాహన కల్పించాలి. ప్రయివేటు స్కూల్స్ అన్నీ ప్లాస్టిక్ రహిత విద్యాలయాలుగా మార్చాలని కోరుతున్నానని అన్నారు.