వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదం

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల, డిసెంబర్ 13 (way2newstv.com)
మానవుడు అత్యున్నత స్థాయికి చేరేందుకు యోగా దోహదపడుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల ఆస్థాన మండపంలో బ్రహ్మశ్రీ  ప్రభాకర్ విద్యాకేంద్రం ఏర్పాటు చేసిన మూడు రోజుల సమ్మేళనాన్ని సుబ్బారెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం  ఐదు రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోగా ఆచార్యులు, ధ్యాన గురువులనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఎంతటి ఒత్తిడినైనా తట్టుకునే సామర్ధ్యం ధ్యానం, యోగా సాధన ద్వారా పొందవచ్చన్నారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇలాంటి గొప్ప కలయికను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. 
వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదం

ప్రాచీన యోగాభ్యాసనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ముందు పీఠిన నిలుస్తుందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో మన పూర్వీకులు అందించిన జ్ఞాన సంపదను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సుబ్బారెడ్డి సూచించారు. అనంతరం చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ డీపీపీ సభ్యుడు పెంచలయ్య, నిర్వాహకుడు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.శ్రీవారి ముంగిట బలవన్మరణం.. బాధాకరంశ్రీవారి ముంగిట ఓ యాత్రికుడు  పాల వాహనం కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని వైవీ సుబ్బారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోడం కలచి వేసిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కలియుగ దైవం సన్నిధిలో ప్రాణాలు వదిలితే స్వర్గానికి పోతామనే మూర్ఖపు భావనలకు తావీయొద్దని భక్తులకు, నిఘా సిబ్బందికి సూచించారు. శ్రీవారిపై ఎంతో విశ్వాసంతో వస్తున్నారు...ఆ విశ్వాసంతోనే మనో ధైర్యాన్ని నింపుకొని జీవితంలో ముందుకు సాగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.