పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెల్తా: నడ్డా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెల్తా: నడ్డా

న్యూఢిల్లీ జనవరి 23  (way2newstv.com)
భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడు జగత్ ప్రకాశ్‌ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీని గురువారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలిసినట్లు ఆయన తెలిపారు. విలువైన మోదీ సూచనలతో.. పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నానని నడ్డా స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో లక్ష్యాలను సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పేర్కొన్నారు.
పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెల్తా: నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. గతంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నడ్డా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిగానూ పలు పదవుల్లో పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ బీజేపీ విజయంలో జేపీ నడ్డా కీలక పాత్ర పోషించారు.