నాడు - నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు పాటశాలల రూపు రేఖలు మారుస్తాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాడు - నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు పాటశాలల రూపు రేఖలు మారుస్తాం

డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకం అదనంగా 200 రకాల జబ్బులు పెంచాం
సెంబర్ 2020 నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అమలు చేయడం
ఈ నెల 9 న చిత్తూరు జిల్లా కేంద్రం లో అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
పుంగనూరు, జనవరి 04  (way2newstv.com)
అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీనాభివ్రుద్ది మరియు గనులు భూగర్భ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొనారు. శనివారం ఉదయం పుంగనూరు పట్టణం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ 2006 వ సంవత్సరంలో అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో పాటు,104,108 వాహనాలను ప్రారంబించడం జరిగిందని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోను ఆరోగ్య శ్రీ పథకంతో పాటు 104,108 వాహనాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 
నాడు  - నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు పాటశాలల రూపు రేఖలు మారుస్తాం

తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంబించిన ఆరోగ్య శ్రీ పథకానని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడమే ముఖ్య మంత్రి యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. డాక్టర్ వై.ఎస్.ఆర్ నవశకం పథకం ద్వారా రాష్ట్రంలోనే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పేదలకు వైద్య ఖర్చులతో పాటు వారి కుటంబ ఆర్తికంగా ఇబ్బందులు కలుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 1059 రకాల జబ్బులకు మాత్రమే ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులో  ఉండేదని, ప్రస్తుతం అదనముగా 200 రకాల జబ్బులను చేర్చిన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో ముఖ్య మంత్రి గారు ప్రారంబించడం జరిగిందని తెలిపారు.  నెలకు ఒక జిల్లా చొప్పున డిసెంబర్ 2020 నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 39 ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా డాక్టర్ వై.ఎస్.ఆర్.ఆరోగ్య శ్రీ పథకం ద్వారా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 11 లక్షల 33 వేల 583 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని, మొదటి విడతలో 2068 మందికి ఈ నెల 3వ తేదీ నుండి జిల్లాలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగలిన వారు కూడా ఇదివరకే ఉన్న ఆరోగ్య శ్రీ కార్డులు కూడా యధావిధిగా చల్లుబాటు అవుతుందని తెలిపారు. గతంలో ఐతే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవని, ప్రస్తుతం రాష్ట్రం ముఖ్య మంత్రి ఆలోచించి పక్క రాష్ట్రాలైన తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో 135 కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు  పొందెందుకు అవకాసం కల్పించడం జరిగిందని అన్నారు.   డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పథకం క్రింద శస్త్ర చికిత్సలు చేయించుకొన్న వారికి మందులు మరియు పౌస్టిక ఆహార ఖర్చుల కొరకు రోజుకు రూ.225 చొప్పున ఘరిస్టంగా నెలకు రూ.5 వేలు ఆర్ధిక సహాయం డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆసరా ద్వారా లబ్దిదారుల బ్యాంకుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నాడు – నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పాటశాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించుటకు కాను ప్రతి సంవత్సరం 33 శాతంతో రాబోయే 3  సంవత్సరాలలో 100 శాతం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రులందు శస్త్ర చికిస్త్సలు చేయుటకు కావలసిన అధునాతన పరికరాలు, మందులు, డాక్టర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం మరియు పాటశాలలో ఫర్నిచర్స్ , త్రాగు నీరు, మరుగు దొడ్లు, కాంపౌండ్ వాల్స్, ఆట స్థలాలు, భోదన సిబ్బంది వంటి మౌలిక సదుపాయాలను రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో అమలుపరచడం జరుగుతుందని తెలిపారు.   వైద్య సేవతో పాటు నాణ్యమైన విద్యను అందించుట కోసం అమ్మ ఒడి పథకంను ఈ నెల 9 న చిత్తూరు జిల్లాలో ప్రారంబించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15వేలు అందజేయడం జరుగుతుందన్నారు. పాటశాలలో విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకం,యూనిఫాం, పుస్తకాలు, ఆడపిల్లలకు సైకిల్ పంపిణీ వంటి కార్యక్రమంతో పాటు పై చదువులకు వెళ్ళిన విద్యార్థులకు ఫీజ్ రిఎంబెర్స్ మెంట్ తో పాటు  వారి ఖర్చులకు గాను సంవత్సరానికి రూ.20 వేలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.  ఎన్నికలకు ముందు మేనిఫెస్టో లో చెప్పిన మాట  ప్రకారంగా  నవరత్నాలతో పాటు, ఈ 6 నెలలలో 80 శాతం హామీలను నెరవేర్చడం జరిగిందని, అమ్మ ఒడి పథకంతో పాటు ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ,  ఉగాది పండగ నాడు 25 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంబించడం జరిగుతుందని తెలిపారు. అనంతరం 10 మందికి డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులను మంత్రి పంపిణీ చేసారు. అంతక మునుపు ప్రభుత ఆసుపత్రిని పరిశీలించి రోగులతో వైద్య సేవలు బాగా అందిస్తున్నారా.... అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్ ఫైరోజ్ బేగం, డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ కి సంబందించిన  అధికారులు, ఆరోగ్య మిత్రలు, పోకల అశోక్ కుమార్, కొండవీటి నాగాబుషణం, మాజీ కౌన్సిలర్లు వై.ఎస్.ఆర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.