తుమ్మిళ్ల ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తుమ్మిళ్ల ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్

గద్వాల జోగులాంబ, జూన్ 30, (way2newstv.com)
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 (తుంగభద్ర నుంచి అప్రోచ్ కెనాల్ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని)ను మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు  కెసిఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు.  సుంకేశుల బ్యారేజ్ను ఏరియల్ సర్వే ద్వారా కెసిఆర్ పరిశీలించారు. అధికారులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పనుల పనితీరును సీఎం కేసీఆర్కు వివరించారు.  అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ సుంకేశుల సమీపంలోనుంచి మొదటి పాయింట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే 4 కోట్ల రూపాయిల ఖర్చుతో 10 శాతం ఎత్తిపోతల పనులను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్