జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించలెం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ జూలై 24  (way2newstv.com)  
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన ప్రదర్శనలను పూర్తిగా నిషేధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జంతర్ మంతర్‌తో పాటు ఇండియా గేట్ సమీపంలో ఉన్న బోట్ క్లబ్ వద్ద జరిగే ధర్నాలు,ఆందోళనలపై ఇవాళ సుప్రీం స్పందించింది. అయితే నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. న్యాయమూర్తులు ఏకే సిక్రీఅశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే హక్కు ఇవ్వాలంటూ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ కోర్టులో పిటీషన్ వేసింది. అయితే జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టరాదు అని ఎన్జీటీ గతంలో ఆదేశించింది.
 
 
 
జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించలెం: సుప్రీంకోర్టు

Previous Post Next Post