నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

(way2newstv.com)   
మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. 
హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. 
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది. 
గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు. 
తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు.. 



నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!