నర్సాపూర్ బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నర్సాపూర్ బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రులు

మెదక్, జూలై 26, (way2newstv.com) 
జిల్లాలోని  నర్సాపూర్ లో మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి,  హరీష్ రావు గురువారం  పర్యటించారు.  కొత్తగా రూ. 10 కోట్లతో నర్సాపూర్ ఆర్టీసీ డిపో నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి,  ఎంఎల్ఏ మథన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఇతర నేతలు పాల్గోన్నారు.   మంత్రి మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ *రాష్ట్రం లో కొత్త డిపోల ఆలోచన లేకున్నా నాడు రవాణా మంత్రి గా సీఎం కేసీఆర్   హామీ మేరకు 98 వ డిపోగా  నర్సాపూర్ ఏర్పాటు చేస్తున్నం. నిర్మాణాలు త్వరలో పూర్తిచేసి  26 బస్సులతో, 150 మంది సిబ్బంది తో డిపో ప్రారంభిస్తున్నమని అన్నారు. 
 
 
 
 నర్సాపూర్ బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రులు
 
టీ - వ్యాలెట్ తో ఆర్టీసీ లో పూర్తి స్థాయిలో ఆన్ లైన్  రిజర్వేషన్ వుంటుంది.  నష్టాలున్నా పల్లె పల్లెకు ఆర్టీసీ సేవలు వుంటాయని అయన అన్నారు.  ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఆదాయంతో పా టు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  మహేందర్ రెడ్డి తెలిపారు.  ఇలా 110 పెట్రోల్పంపులకుఅనుమతులు ఇస్తున్నామని వీటిలో 11 పూర్తిఅయ్యాయని మంత్రి చెప్పారు.  ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలను బలో పేతం చేసేందుకు చర్యలు తీసుసుంటుందని అన్నారు. అందుకు  సీఎం కేసీఆర్ బడ్జెట్ లో 1000 కోట్లు అందించారని , అన్ని బస్ స్టాండ్ లలో ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కోసం రూ. 66 కోట్లు అందించామని వెల్లడించారు.  రాష్ట్ర వ్యప్తంగా ఆర్టీసీ లో రోజు 95 లక్షలు, హైదరాబాద్ లో 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారని పేర్కొంటూ,ఆర్టీసీ లో ప్రయాణించే వారంతా పేదలేనన్నారు. రాష్ట్రంలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు మినీ బస్సులు నడుపుతామని తెలిపారు. ఇప్పటికే 360 మినీ బస్సులను కొన్నామని వీటిలో  మినీ ఏసీ వజ్ర  బస్సుల సేవలు వరటగల్ - హైదరాబాద్ ల మధ్య సాగుతున్నాయని వీటి  పనితీరు బాగుందన్నారు.  దేశంలో ప్రమాదాలు తగ్గించిన రాష్ట్రం గా తెలంగాణ ఖ్యాతి చాటటం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని అయితే  ప్రమాద రహిత తెలంగాణ సాదిద్దామని పిలుపునిచ్చారు. ఇలా రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని తామ ప్రభుత్వం కోరుతుందని చెప్పారు. రాష్ట్రంలో రవాణా శాఖకు సంత భవనాలు కల్పించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.